ఈ ప్రశ్నలు సోషల్ మీడియా ద్వారా మాత్రం అడగొద్దు: రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి సలహా
- అంతర్జాతీయ సమస్యలపై ట్విట్టర్ లో ప్రశ్నలు వద్దు
- మీరే స్వయంగా తెలుసుకోండి
- కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఇంటర్నేషనల్ ఇష్యూలపై సోషల్ మీడియాలో ఏమీ అడగవద్దన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలుసుకోవాలని సెటైర్లు వేశారు. గతంలో బాలాకోట్ దాడులపైనా, ఊరీ దాడులపైనా ఆధారాలను రాహుల్ అడిగారని గుర్తు చేశారు. కాగా, లడఖ్ ప్రాంతంలో చైనా, సరిహద్దులను దాటి భారత భూ భాగాన్ని ఆక్రమించిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో, మోదీ మౌనంగా ఉంటూ, తనకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని రాహుల్ సోషల్ మీడియా ద్వారా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.