ఆ చిత్రానికి బల్క్ డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్!
- 'కేజీఎఫ్'తో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్
- 'ఆర్ఆర్ఆర్', త్రివిక్రమ్ సినిమాల తర్వాత ఇదే
- ఏడాది పాటు డేట్స్ ఇచ్చిన ఎన్టీఆర్
ప్రస్తుతం ప్రశాంత్ 'కేజీఎఫ్'కి సీక్వెల్ చేస్తున్నాడు. ఇదే సమయంలో ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా వున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ప్రాజక్ట్ ఇప్పటికే సెట్ అయింది. సో.. ఈ రెండు చిత్రాల తర్వాత ప్రశాంత్ చిత్రం చేయడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడట.
ఇక ఈ సినిమా విస్తృతిని బట్టి దీనికి ఏడాది పాటు డేట్స్ కేటాయించడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. చిత్రాన్ని ఎక్కడా, ఏ విషయంలోనూ రాజీ పడకుండా చేద్దామని ఎన్టీఆర్ దర్శకుడికి చెప్పినట్టు సమాచారం. రేపు ఎన్టీఆర్ బర్త్ డే కాబట్టి, ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.