Amrutha: తల్లిని కలిసేందుకు అమృత ఎలా వెళ్లిందంటే?

Amrutha met Mother yesterday

  • కారులో ముందు అమృత.. వెనక పోలీసులు
  • తల్లిని ఓదార్చిన అనంతరం తిరిగి అత్తారింటికి
  • నాగార్జునసాగర్‌లో తండ్రికి ఉన్న ప్లాట్ల పరిశీలన

తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన అమృత, నిన్న తల్లిని కలిసి ఓదార్చింది. మీడియా కంట పడకుండా, పోలీసుల రక్షణ మధ్య మిర్యాలగూడలోని తల్లి గిరిజ ఇంటికి చేరుకున్న అమృత తల్లితో కాసేపు గడిపింది. కారులో కుమారుడితో కలిసి అమృత బయలుదేరగా, వెనక పోలీసులు ఆమెను అనుసరించారు. తల్లిని కలిసే ముందు కానీ, ఆ తర్వాత కానీ అమృత ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించలేదు. మీడియా అనుసరించకుండా చూడాలని పోలీసులకు చెప్పి ఒంటరిగా వెళ్లి కలిసింది.

నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో తల్లిని కలిసిన అమృత పావుగంటపాటు అక్కడే ఉంది. కుమార్తెను చూసిన తల్లి గిరిజ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. తల్లిని ఓదార్చిన అనంతరం అమృత తిరిగి అత్తారింటికి వెళ్లిపోయింది. కాగా, నాగార్జునసాగర్‌లో తన తండ్రికి ఉన్న ప్లాట్లను నిన్న అమృత పరిశీలించింది. ఓ వ్యక్తితో కలిసి బైక్‌పై వచ్చిన అమృత ప్లాట్ల ఫొటోలు తీసుకోవడాన్ని కొందరు స్థానికులు ఫొటోలు తీయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

Amrutha
Nagarjuna sagar
Miryalaguda
Nalgonda District
Maruti Rao
  • Loading...

More Telugu News