ఆగిపోయిన 'శీనయ్య' సినిమా?
- వినాయక్ హీరోగా 'శీనయ్య'
- తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి
- అవుట్ పుట్ పట్ల వినాయక్ అసంతృప్తి
ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రషెస్ చూసిన తరువాత వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఈ ప్రాజెక్టును ఇక్కడితో ఆపడమే మంచిదని చెప్పాడట. అందుకు 'దిల్' రాజు అంగీకరించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే మాట బలంగానే వినిపిస్తోంది. ఇక వినాయక్ దర్శకుడిగా తదుపరి సినిమాపై దృష్టి పెడతాడేమో.