'దర్బార్' ప్రత్యేకమన్న మురుగదాస్ .. డబ్బింగ్ పూర్తిచేసిన రజనీకాంత్
- రజనీ తాజా చిత్రంగా రూపొందిన 'దర్బార్'
- కథానాయికగా కనిపించనున్న నయనతార
- జనవరి 10వ తేదీన భారీ విడుదల
రజనీ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకోవడం పూర్తయిందని, తాజాగా తన ట్విట్టర్ ద్వారా మురుగదాస్ తెలియజేశాడు. రజనీతో కబుర్లు చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా మిగతా పనులను పూర్తిచేసుకోనుంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను, సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 10వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.