స్థానిక వివాదాన్ని జాతీయ సమస్యగా మార్చారు: 'అయోధ్య' తీర్పుపై లోక్ సత్తా జేపీ వ్యాఖ్యలు
- అయోధ్య భూమి హిందువులదేనంటూ సుప్రీం తీర్పు
- ట్విట్టర్ లో స్పందించిన జయప్రకాశ్ నారాయణ
- ఈ అధ్యాయాన్ని ముగిద్దాం అంటూ పిలుపు
"హిందువులు కానీ, ముస్లింలు కానీ... అన్ని వర్గాల ప్రజలు అయోధ్య వివాదంలో అనవసర రాద్ధాంతానికి ముగింపు కోరుకున్నారు. ఒక స్థానిక భూవివాదం జాతీయ సమస్యగా మారిందంటే అందుకు కారణం పక్షపాత రాజకీయాలు, కొన్ని గ్రూపుల అస్థిత్వ పోరాటం. ఇక ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. మన యువత భవిష్యత్ పై దృష్టి సారిద్దాం" అంటూ ట్వీట్ చేశారు.