ధనుశ్ మూవీ రీమేక్ పై ఆసక్తిని చూపుతున్న చరణ్
- దసరాకి తమిళంలో విడుదలైన 'అసురన్'
- ధనుశ్ నటనకి దక్కుతున్న ప్రశంసలు
- చాలా వేగంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరిన చిత్రం
తమిళంలో ధనుశ్ హీరోగా చేసిన 'అసురన్' దసరాకి విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా వేగంగా ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. కేవలం హిట్ కొట్టడమే కాదు .. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. వెట్రిమారన్ దర్శక ప్రతిభకు .. ధనుశ్ నటనకు అవార్డులు దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగానే 'అసురన్' రీమేక్ హక్కులపై చరణ్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.