తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 90 కోట్ల షేర్ ను రాబట్టిన 'సైరా'
- ఈ నెల 2న వచ్చిన 'సైరా నరసింహా రెడ్డి'
- భారీతారాగణం - భారీ బడ్జెట్
- మరింతగా వసూళ్లు పెరిగే అవకాశం
'సైరా'కి పోటీగా భావించదగిన సినిమాలేవీ దగ్గరలో లేవు. అందువలన ఈ వీకెండ్ తో పాటు మరికొన్ని రోజులు ఈ సినిమా వసూళ్ల దూకుడు తగ్గకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులోనే కాకుండా విడుదలైన మిగతా భాషల్లోను ఈ సినిమా విజయకేతనాన్ని ఎగరేస్తూ ఉండటంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతవరకూ చిరంజీవి చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక్కటి ఒక ఎత్తు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.