కోలీవుడ్లో మళ్లీ నయనతార పెళ్లి టాక్
- వరుస సినిమాలతో నయనతార
- విభిన్న కథాచిత్రాలలో అవకాశాలు
- డిసెంబర్లో పెళ్లి అంటూ టాక్
నయనతార .. విఘ్నేశ్ శివన్ చాలా కాలంగా ప్రేమలో వున్నారు. ఇద్దరూ ఒకే ఇంట్లో వుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరుగుతోంది. ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటూనే, ఏ మాత్రం తీరిక దొరికినా విదేశాల్లో విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఈ డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సారైనా వీళ్లు ఈ ప్రచారాన్ని నిజం చేస్తారో .. లేదంటే ఎప్పటిమాదిరిగానే చెట్టాపట్టాల్ తోనే సరిపెడతారో చూడాలి.