'సైరా' ప్రీ రిలీజ్ వేడుకకు కొత్త డేట్!
- భారీ చారిత్రక చిత్రంగా 'సైరా'
- ఈ నెల 22న ప్రీ రిలీజ్ ఈవెంట్
- వచ్చేనెల 2వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ప్రీ రిలీజ్ ఫంక్షన్ డేట్ ను వెల్లడించారు. ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ - ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను జరపనున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానుందనే విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి .. తమన్నా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.