'సైరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథులుగా కేటీఆర్, పవన్ కల్యాణ్!
- భారీ చారిత్రక చిత్రంగా 'సైరా'
- 18న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
- అక్టోబర్ 2వ తేదీన విడుదల
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా కర్నూల్లో జరపాలనుకున్నారు. అయితే, కొన్ని ఇబ్బందుల కారణంగా హైదరాబాదులోనే నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకను ఈ నెల 18వ తేదీన హైదరాబాద్, లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ప్రత్యేక అతిథులుగా కేటీఆర్, పవన్ కల్యాణ్, రాజమౌళి, శివ కొరటాల, వీవీ వినాయక్ విచ్చేస్తారని ఆ ప్రకటనలో సంస్థ పేర్కొంది.