భారీ రేటుకు విజయ్ 'బిగిల్' సినిమా తెలుగు హక్కులు
- విజయ్ - అట్లీ కాంబినేషన్లో 'బిగిల్'
- దీపావళికి ప్రేక్షకుల ముందుకు
- త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటన
కల్పాతి అఘోరామ్ నిర్మిస్తోన్న ఈ సినిమాను దీపావళికి భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు హక్కులను మహేశ్ కోనేరు దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన ఫ్యాన్సీ రేటును చెల్లించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా మహేశ్ కోనేరు స్పందిస్తూ ..'బిగిల్' సినిమా తెలుగు హక్కులు మా ఈస్ట్ కోస్ట్ బ్యానర్ కి దక్కడం ఆనందంగా వుంది. ఇందుకు కారకులైన విజయ్ కి .. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నాము. త్వరలోనే తెలుగు టైటిల్ ను ప్రకటిస్తాము" అని ఆయన చెప్పుకొచ్చారు.