'సైరా' నుంచి మేకింగ్ వీడియో రిలీజ్
- భారీ చిత్రంగా రూపొందిన 'సైరా'
- ఈ నెల 20వ తేదీన టీజర్ రిలీజ్
- అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల
భారీ సెట్ల నిర్మాణం .. యుద్ధ సామాగ్రిని సిద్ధం చేసిన తీరు .. కాస్ట్యూమ్స్ ను డిజైన్ చేసిన విధానం .. ప్రధాన పాత్రధారులకి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ .. ఆంగ్లేయులపై నరసింహా రెడ్డి తిరుగుబాటు .. ఇరువర్గాలకి చెందిన పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరిగిన తీరును మేకింగ్ వీడియోగా వదిలారు. చిత్రీకరణ ఏ స్థాయిలో జరిగిందనడానికి ఈ మేకింగ్ వీడియో అద్దం పడుతోంది. సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతోంది. మెగా అభిమానులకు మరో కానుకగా ఈ నెల 20న టీజర్ ను వదలనున్నారు.