Karthikeya: నా కారణంగా ఆ అమ్మాయి స్కూల్ మానేసింది: కార్తికేయ
- స్కూల్ డేస్ లో లవ్ లో పడ్డాను
- ఆ అమ్మాయి ఇంటికి వెళ్లేవాడిని
- మా నాన్నకి తెలియడంతో తెరపడిపోయిందన్న కార్తికేయ
కార్తికేయ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గుణ 369'కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సిన్సియర్ ప్రేమికుడిగా ఆయన మంచి మార్కులు కొట్టేశాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన పాల్గొనగా ప్రేమను గురించిన ప్రస్తావన వచ్చింది.
అప్పుడు కార్తికేయ స్పందిస్తూ .. "స్కూల్ డేస్ లో ఓ అమ్మాయిపై లవ్ లాంటిది ఉండేది. స్నేహితులతో కలిసి ఆ అమ్మాయి వాళ్లింటికి వెళ్లి ఆడుకునేవాడిని. ఏదో వ్యవహారం నడుస్తుందనే అనుమానం మా నాన్నకు వచ్చింది. ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళుతుండగా, దార్లో మా నాన్న ఎదురయ్యాడు. 'ఎక్కడికిరా?' అని అడిగితే 'ఆడుకోవడానికి' అని చెప్పాను. 'ఎవరింట్లో' అని అడిగితే ఆ అమ్మాయి పేరు చెప్పాను. 'బండి ఎక్కు' అంటే మాట్లాడకుండా ఎక్కేశాను. ఆ తరువాత ఆయన ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడంతో స్కూల్ మానేసింది .. అంతటితో ఆ ఫ్రెండ్షిప్ కట్ అయింది" అని చెప్పుకొచ్చాడు.