మూడు భాషలను నేర్చుకోవాలని విద్యార్థులను ఒత్తిడి చేయడం సరికాదు!: హీరో సూర్య
- జాతీయ విద్యావిధానం ముసాయిదాపై స్పందించిన నటుడు
- చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా టీచర్లు లేరని వ్యాఖ్య
- అందరికీ సమాన అవకాశం లేకపోతే నీట్ ఉత్తీర్ణత ఎలా?
పిల్లలకు చదువు నేర్పించడం తనకే కష్టంగా ఉందని సూర్య వ్యాఖ్యానించాడు. దేశంలో చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ టీచర్లు లేరనీ, ఇది దారుణమని అన్నాడు. అందరికీ సమానమైన అవకాశాలు లేనప్పుడు జాతీయ వైద్య విద్య ప్రవేశ పరీక్ష(నీట్)లో ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందని ప్రశ్నించాడు.
ఇకపై ప్రభుత్వ పాఠశాలల కంటే కోచింగ్ సెంటర్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని స్పష్టం చేశాడు. కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం ముసాయిదాపై అందరూ స్పందించాలని సూర్య విజ్ఞప్తి చేశాడు. లేదంటే గ్రామీణ విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోతాయని హెచ్చరించాడు.