'ఇస్మార్ట్ శంకర్'కి హిట్ ఖాయం: హీరోయిన్ నభా నటేశ్
- పూరి కథ చెప్పగానే ఓకే అన్నాను
- మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాత్ర
- ఈ ఛాన్స్ లభించడం అదృష్టమన్న నభా
తాజా ఇంటర్వ్యూలో నభా నటేశ్ మాట్లాడుతూ .. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో నా పాత్రను గురించి పూరిగారు చెప్పగానే, వెంటనే ఓకే చెప్పేశాను. ఎందుకంటే ఇలాంటి పాత్ర చాలా అరుదుగా వస్తుంది. ఈ సినిమాలో రామ్ పాత్రకి తగినట్టుగానే నన్ను పూరి చూపించారు. ట్రైలర్లో నన్ను మీరు చూసింది శాంపిల్ మాత్రమే. సినిమాలో నా పాత్ర మాస్ ఆడియన్స్ కి బాగా నచ్చేలా ఉంటుంది. పూరి .. రామ్ కాంబినేషన్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ సినిమా తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.