బన్నీ సరసన నాయికగా మరో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్
- 'మెంటల్ మదిలో' ద్వారా పరిచయం
- 'బ్రోచేవారెవరురా'తో మరింత గుర్తింపు
- బన్నీ నుంచి మార్కులు కొట్టేసిన నివేదా పేతురాజ్
సినిమా .. సినిమాకి ఈ సుందరి క్రేజ్ పెరుగుతుండటం వలన, ఆమె నటన నచ్చడం వలన తన తదుపరి సినిమాకి ఆమెను అల్లు అర్జున్ సిఫార్స్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమాకి 'ఐకాన్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో నాయికగా నివేదా పేతురాజ్ అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు.