నేను పెద్ద హీరోయిన్ ను అవుతానని శోభన్ బాబుగారు ముందే చెప్పారు: సీనియర్ హీరోయిన్ నళిని
- శోభన్ బాబుతో 'తోడు - నీడ' చేశాను
- ఆయన మంచి మనసున్న మనిషి
- డబ్బు విషయంలో జాగ్రత్తలు చెప్పారన్న నళిని
"తెలుగులో 'తోడు నీడ' చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో హీరో శోభన్ బాబు. నిజంగా ఆయన జెంటిల్ మేన్. ఆయనతో కలిసి నటించిన తరువాతనే తెలుగు సినిమాల పట్ల నాకు ఆసక్తి పెరిగింది. నేను హీరోయిన్ గా బిజీ అవుతానని అప్పట్లోనే మా అమ్మగారికి శోభన్ బాబుగారు చెప్పారు. 'మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు వుంది .. పెద్ద హీరోయిన్ అవుతుంది .. డబ్బులు అనవసరంగా ఖర్చు చేయకండి .. స్థలాలు కొనుక్కోండి .. ఇళ్లు కట్టుకోండి' అని ఆయన మా అమ్మగారితో చెప్పారు. ఇలా భవిష్యత్తుకు సంబంధించి ఆయన మంచి మంచి సలహాలు .. సూచనలు ఇచ్చేవారు" అని చెప్పుకొచ్చారు.