దుమ్మురేపేస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' లిరికల్ వీడియో
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- మాస్ ఆడియన్స్ ను ఊపేసే సాంగ్
- త్వరలో విడుదల తేదీ ప్రకటన
'సిలక సిలక సిలక ఇది సితరాంగి సిలక .. పిలగా పిలగా పిలగా పెట్టిపోరా సురక .. " అంటూ ఈ పాట మొదలవుతోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని, ఇద్దరు కథానాయికల కాంబినేషన్లో రామ్ పై చిత్రీకరించిన పాట ఇది. మణిశర్మ సంగీతం .. కాసర్ల శ్యామ్ సాహిత్యం .. కీర్తన శర్మ - సాకేత్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ కి హిట్ పడటం ఖాయమనే అభిప్రాయంలో ఆయన అభిమానులు వున్నారు. వాళ్ల ఆశలను పూరి నిజం చేస్తాడేమో చూడాలి మరి.