ఫ్యాన్స్ కు సర్ ప్రయిజ్... హీరోగా అవతారం ఎత్తనున్న దర్శకుడు వీవీ వినాయక్!
- గతంలో 'ఠాగూర్'లో నటించిన వినాయక్
- దిల్ రాజు నిర్మాతగా హీరోగా పరిచయం కానున్న దర్శకుడు
- దర్శకత్వం వహించనున్న నరసింహారావు
'శరభ' ఫేమ్, గతంలో శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. మరో రెండు నెలల్లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. గతేడాది సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన 'ఇంటెలిజెంట్' తరువాత వినాయక్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదన్న సంగతి తెలిసిందే.