సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా రానున్న సినిమాలు ఇవే
- కంటెంట్ కి ప్రాధాన్యతనిస్తోన్న సురేశ్ ప్రొడక్షన్స్
- చిన్న సినిమాలకి ప్రోత్సాహం
- త్వరలోనే విడుదల తేదీల ప్రకటన
సమంత ప్రధాన పాత్రధారిగా చేస్తోన్న 'ఓ బేబీ' .. అల్లు శిరీశ్ హీరోగా చేసిన 'ఏబీసీడీ' .. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తోన్న 'దొరసాని' .. నివేద థామస్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'బ్రోచేవారెవరురా' .. 'ఫలక్ నుమా దాస్' .. 'మల్లేశం' సినిమాలు సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వరుసగా విడుదల కానున్నాయి. ఈ సినిమాల విడుదల తేదీలను త్వరలోనే వెల్లడించనున్నారు. ఈ చిన్న సినిమాల్లో పెద్ద విజయాలను అందుకునేవేవో చూడాలి మరి