హీరోగా సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్న కీరవాణి కుమారుడు
- కీలక పొజిషన్‌లో రాజమౌళి కుటుంబీకులు
- సంగీత దర్శకుడిగా మొదటి కుమారుడు
- నూతన దర్శకుడు తెరకెక్కించనున్న చిత్రం
రాజమౌళి కుమారుడు కార్తికేయ నిర్మాతగా, ఆయన సోదరుడు కీరవాణి కుమారుడు సంగీత దర్శకుడిగా ఓ సినిమాకు పని చేస్తున్నారు. మరోపక్క, కీరవాణి రెండో కుమారుడు సింహ హీరోగా సినీరంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.