"నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను" నయనతార 'ఐరా' నుంచి ట్రైలర్ రిలీజ్
- నయనతార నుంచి మరో హారర్ మూవీ
- ద్విపాత్రాభినయం చేసిన నయన్
- ఈ నెల 28వ తేదీన భారీ విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దెయ్యాలు ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నించిన నయనతార .. ఎలాంటి ఇబ్బందుల్లో పడిందనే కథాంశంతో ఈ కథ కొనసాగుతుందని ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. "ఈ లోకంలో ఎవరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు అభి .. దానిని దూరం చేసిన ఎవరినీ నేను ప్రాణాలతో వదలను".. "నేనే మొదలు పెట్టాను .. నేనే పూర్తి చేస్తాను" వంటి డైలాగ్స్ సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. నయనతార ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది