శాటిలైట్ రైట్స్ విషయంలో 'ఇస్మార్ట్ శంకర్' షాక్!
- పూరి నుంచి 'ఇస్మార్ట్ శంకర్'
- రామ్ జోడీగా ఇద్దరు నాయికలు
- ఫిల్మ్ నగర్లో ఇప్పుడిదే చర్చ
10 కోట్ల రూపాయలు ఇస్తేనే శాటిలైట్ హక్కులు ఇస్తామని మేకర్స్ చెప్పడంతో, టీవీ చానల్స్ వారు షాక్ అయ్యారట. వాళ్లు చెప్పింది కేవలం శాటిలైట్ రైట్స్ రేటు మాత్రమే .. డిజిటల్ రైట్స్ కి గాను వేరే రేటు ఫిక్స్ చేసిపెట్టుకున్నారని సమాచారం. ఒక వైపున పూరి వరుస పరాజయాలతో వున్నాడు. మరో వైపున రామ్ కూడా పరాజయాలతోనే ప్రయాణం చేస్తున్నాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ఈ స్థాయి రేటు చెప్పడం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.