హైదరాబాద్ యాసలో అదుర్స్ అనిపిస్తుందట
- షూటింగు దశలో 'ఇస్మార్ట్ శంకర్'
- ప్రత్యేకంగా మలిచిన నభా నటేశ్ పాత్ర
- మరో కథానాయికగా నిధి అగర్వాల్
ఈ సినిమాలో నభా నటేశ్ పాత్రను విభిన్నంగా మలచినట్టుగా తెలుస్తోంది. పాత్ర పరంగా ఆమె హైదరాబాద్ యాసలో మాట్లాడుతుందట. అందుకోసం ఆమె హైదరాబాద్ యాసను నేర్చుకుంటున్నట్టుగా చెబుతున్నారు. ఈ పాత్ర తనకి చాలా మంచి పేరును తెస్తుందనీ, మరిన్ని అవకాశాలను కూడా తీసుకొస్తుందని నభా నటేశ్ భావిస్తోందట. ఇక మరో వైపున నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఈ ఇద్దరి కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.