రాయ్ లక్ష్మి గ్లామర్ ప్రధానంగా 'వేరీజ్ ద వెంకటలక్ష్మీ' టీజర్
- ప్రధాన ఆకర్షణగా రాయ్ లక్ష్మి గ్లామర్
- ముఖ్య పాత్రల్లో ప్రవీణ్ .. మధునందన్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
రాయ్ లక్ష్మి గ్లామర్ ను హైలైట్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. యూత్ ను థియేటర్స్ కి రప్పించేలా ఈ టీజర్ వుంది. గ్లామర్ విషయంలో రాయ్ లక్ష్మికి వంకబెట్టవలసిన పనిలేదు. కానీ ఆమె గ్లామర్ ను మాత్రమే ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. మరి ఈ సినిమా ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇక ప్రవీణ్ .. మధునందన్ లు ఈ సినిమాలోని పాత్రల ద్వారా మరో ముందడుగు వేశారనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ వాళ్ల కెరియర్ ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు వున్నాయి.