'వేరీజ్ ద వెంకట లక్ష్మీ' నుంచి లిరికల్ సాంగ్ వీడియో
- రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రధారి
- దర్శకుడిగా కిషోర్ కుమార్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఏ మాయ చేసిందో .. ఏ మంత్రం వేసిందో .. చూపులతో తీసిందే ప్రాణం. ఊరించే ఆ అందం .. ఊహల్లో ఆనందం .. గుండెల్లో గుచ్చిందే బాణం" అంటూ ఈ సాంగ్ కొనసాగుతోంది. రాయ్ లక్ష్మీ పై మనసు పారేసుకున్న కమెడియన్స్ ప్రవీణ్ .. మధుసూదన్ ఊహలకు అక్షర రూపంగా ఈ పాట వస్తుందని అర్థమవుతోంది. బాలాజీ సాహిత్యం .. హరి గౌర సంగీతం - గానం ఆకట్టుకునేలా వున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.