సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోయిన 'విశ్వాసం'
- శివ దర్శకత్వంలో 'విశ్వాసం'
- జనవరి 10న థియేటర్లకు
- అదే రోజున వస్తోన్న రజనీ 'పేట'
సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోతోంది. జనవరి 10వ తేదీన ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నయనతార కథానాయిక కావడం ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతోంది. ఇదే రోజున తమిళంలో రజనీ మూవీ 'పేట' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుండటంతో, అంచనాలు భారీగానే వున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తుండటం కోలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.