కొత్త సంవత్సరంలో ఎన్నికల గోదాలోకి... కీలక ప్రకటన చేసిన నటుడు ప్రకాశ్ రాజ్!
- ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను
- ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా
- ట్విట్టర్ లో వెల్లడించిన ప్రకాశ్ రాజ్
"అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి మద్దతుతో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను" అని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, రజనీకాంత్, కమలహాసన్ తర్వాత రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సినీ ప్రముఖుల్లో ప్రకాష్‌రాజ్ మూడో వ్యక్తి.