కేసీఆర్ వేసుకున్న బీజేపీ ముసుగు త్వరలోనే తొలగిపోతుంది: విజయశాంతి
- ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు
- యూపీఏ బలపడకుండా కుట్ర
- బీజేపీ రుణం తీర్చుకునేందుకు ఆరాటం
మళ్లీ ఎన్టీఏను అధికారంలోకి తీసుకువచ్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. సీఎంలు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీలతో కేసీఆర్ భేటీ కావడం కేసీఆర్ కుట్రలో భాగమేనని విజయశాంతి విమర్శించారు. తెర వెనుక నుంచి సహకరించిన బీజేపీ రుణం తీర్చుకునేందుకు కేసీఆర్ ఆరాటపడుతున్నారని.. త్వరలోనే ఆయన వేసుకున్న బీజేపీ ముసుగు తొలగిపోవడం ఖాయమన్నారు.