Rakul Preeth: పబ్లిసిటీ కోసం ‘మీటూ’ని వాడుకోవద్దు: రకుల్
- మహిళలతో తప్పుగా ప్రవర్తించడం సరికాదు
- లైంగిక వేధింపుల విషయంలో అదృష్టవంతురాలిని
- నేనెప్పుడూ అలాంటి వేధింపులకు గురికాలేదు
గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ‘మీటూ’ ఉద్యమానికి సంబంధించిన వార్తలే కనపడుతున్నాయి. గతంలో వివిధ సందర్భాలలో తాము ఎదుర్కున్న వేధింపులను పలువురు వెల్లడిస్తున్నారు. వీరికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ కూడా స్పందించింది. లైంగిక పరమైన వేధింపులు.. మహిళలతో తప్పుగా ప్రవర్తించడం వంటివి సరికాదని అభిప్రాయపడింది.
అయితే, పబ్లిసిటీ కోసం మాత్రం ‘మీటూ’ని వాడుకోవద్దని కోరారు. ఈ ఉద్యమం భారత్లో రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన రకుల్.. లైంగిక వేధింపుల విషయంలో తాను అదృష్టవంతురాలినని పేర్కొన్నారు. తానెప్పుడూ ఇలాంటి వేధింపులకు గురికాలేదని ఆమె వెల్లడించారు. బాధితులంతా బయటకు రావడం పట్ల రకుల్ ఆనందం వ్యక్తం చేసింది.