సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సెట్లో సరదాగా వుంటానంటున్న అనుపమ
- నాగార్జున తెలుగు-తమిళ చిత్రం మొదలు
- వినాయక చవితికి అర్జున్ 'కురుక్షేత్రం'
- ఫుల్ రన్ లో 'గూఢచారి' షేర్
* తమిళ హీరో ధనుశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ నిన్న మొదలైంది. ఇందులో ధనుశ్ సరసన అదితీరావు హైదరి హీరోయిన్ గా నటిస్తోంది.
* సీనియర్ నటుడు అర్జున్ హీరోగా నటించిన 'కురుక్షేత్రం' చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల చేస్తున్నారు. ఇందులో సుమన్, సుహాసిని తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
* అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన 'గూఢచారి' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ చిత్రం ఫుల్ రన్ లో ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం.