వరుసగా మూడు భారీ చిత్రాలు చేయనున్న ధనుష్
- త్వరలో రిలీజ్ కానున్న 'వడ చెన్నై'
- సెట్స్ పై వున్న 'మారి 2'
- కలైపులి థాను నిర్మాతగా భారీ సినిమాలు
ఈ సినిమాకి సీక్వెల్ ను కార్తీక్ సుబ్బరాజుతో ప్లాన్ చేస్తోన్న ధనుష్, కలైపులి థాను నిర్మాణంలో వరుసగా మూడు సినిమాలు చేయడానికి అంగీకరించినట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ మూడు సినిమాలను స్టార్ డైరెక్టర్లే చేస్తారట. తమిళంతో పాటు తెలుగులోను మంచి క్రేజ్ వున్న కథానాయికలను ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.