రజనీకాంత్ సినీ కెరీర్ లో 23 ఏళ్ల తరువాత ఇలా!
- నవంబర్ 29న విడుదలకు సిద్ధమైన '2.0'
- ఒకే సంవత్సరంలో రెండు చిత్రాలు
- 1995లో బాషా, ముత్తు తరువాత ఈ సంవత్సరమే
- వేసవిలో వచ్చిన 'కాలా', దీపావళి సీజన్ కు '2.0'
రజనీ కెరీర్ లో రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో విడుదల కావడం గత 23 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది వేసవిలో పా రంజిత్ దర్శకత్వం వహించిన 'కాలా' విడుదలైన సంగతి తెలిసిందే. 1995లో ఆయన నటించిన ముత్తు, బాషా చిత్రాలు విడుదల అయ్యాయి. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించాయి. రజనీ కెరీర్ లో మైలురాళ్లుగా నిలిచాయి. ఆ తరువాత ఆయన ఏడాదికి, రెండేళ్లకు ఒక చిత్రానికి మాత్రమే పరిమితం అయ్యారు. వాస్తవానికి '2.0' గత సంవత్సరమే విడుదల అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాక వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.