ఎక్కడ ఏది జరిగినా సినీ పరిశ్రమకు లింక్ చేస్తున్నారు: సురేష్ బాబు ఆవేదన
- ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు ఉంటాయి
- చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనేది అవాస్తవం
- సురేష్ ప్రొడక్షన్స్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది
ఇక చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనేది తప్పుడు ప్రచారమని అన్నారు. మంచి సినిమాకు కచ్చితంగా థియేటర్లు దొరుకుతాయని చెప్పారు. 50 ఏళ్ల సురేష్ ప్రొడక్షన్స్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కేవలం గొప్ప చిత్రాల నిర్మాణమే కాకుండా, సంస్థ పది కాలాల పాటు కొనసాగేలా కూడా చిత్ర నిర్మాణం ఉండాలని అన్నారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ, సురేష్ బాబు ఈ మేరకు స్పందించారు.