అనిల్ కపూర్ ఇంట మొదలైన పెళ్లి సందడి!
- అనిల్ కపూర్ ఇంట మోగనున్న పెళ్లి బాజాలు
- మే మొదటి వారంలో సోనమ్ కపూర్ పెళ్లి
- బాయ్ ఫ్రెండ్ ఆనంద్ అహూజాతో వివాహం
దీంతో వివాహ వేడుకకు ముందు నిర్వహించే సంగీత్ కోసం సోనమ్ సిద్ధమవుతోంది. సంగీత్ లో సోనమ్ వేసే స్టెప్పులను ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కంపోజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోనమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. జుహులోని అనిల్ కపూర్ బంగ్లాలో సంగీత్ రిహార్సల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో సోనమ్, ఆనంద్ కుటుంబీకులు సందడి చేయనున్నారు. ముంబైలో వివాహానంతరం ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.