రజనీ జోడీ కట్టేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోన్న త్రిష
- సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీకాంత్ మూవీ
- దర్శకుడిగా కార్తీక్ సుబ్బరాజు
- విలన్ పాత్రలో విజయ్ సేతుపతి
తమిళంలో రజనీకాంత్ మినహా మిగతా అగ్ర హీరోలందరి సరసన త్రిష నటించింది. ఇన్నేళ్ల తన కెరియర్లో ఇంతవరకూ రజనీకాంత్ సరసన ఛాన్స్ లభించకపోవడం పట్ల ఆమె అసంతృప్తితో వుంది. అందువలన ఆయన సరసన ఓ సినిమా చేసే ఛాన్స్ కోసం ఆమె కొంతకాలంగా ఎదురుచూస్తోంది. కార్తీక్ సుబ్బరాజు సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించనున్నాడు. ఆయనతో త్రిషకి మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన ద్వారా ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ను దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోందట. మరి ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.