'కాలా' రిలీజ్ డేట్ పై స్పందించిన లైకా ప్రొడక్షన్స్
- రజనీకాంత్ హీరోగా రూపొందిన 'కాలా'
- మరోమారు డాన్ గా రజనీ
- నిర్మాతగా ధనుష్
ఈ సినిమాను ఫలానా రోజున విడుదల చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఇంతవరకూ మేము అధికారికంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. రిలీజ్ డేట్ విషయంలో గానీ .. ఈ సినిమాకి సంబంధించిన మరే అనధికారిక స్టేట్మెంట్స్ తో గాని తమకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంతకుముందు వార్తలు వచ్చాయి. ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ వారు చేసిన ప్రకటనతో, ఆ రోజున ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చని తెలుస్తోంది.