'గరుడ వేగ' దర్శకుడితో రామ్
- ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్
- త్వరలోనే సెట్స్ పైకి
- ఈ ఏడాదిలోనే విడుదల
'గరుడ వేగ' హిట్ తో ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు. ఆయన వినిపించిన కథకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను పూర్తి చేయడంలో ప్రవీణ్ నిమగ్నమై వున్నాడని అంటున్నారు. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును మొదలుపెట్టేసి, ఈ ఏడాదిలోనే విడుదల చేసే ఆలోచనలో ప్రవీణ్ వున్నాడని అంటున్నారు.