వాయిదా పడిన నిఖిల్ మూవీ .. త్వరలో కొత్త రిలీజ్ డేట్
- నిఖిల్ హీరోగా 'కిరాక్ పార్టీ'
- కథానాయికగా సంయుక్త హెగ్డే
- వచ్చేనెల 16న గానీ .. 23న గాని రిలీజ్
అయితే మెగా హీరోల మధ్య పోటీ మంచిది కాదనే ఉద్దేశంతో, 'తొలిప్రేమ'ను 10వ తేదీకి వాయిదా వేశారు. అంటే ఒక రోజు ఆలస్యంగా విడుదల చేయనున్నారు. ఇక నిఖిల్ 'కిరాక్ పార్టీ' కూడా వాయిదా పడిందనేది తాజా సమాచారం. రియలిస్టిక్ సౌండ్స్ తో నేపథ్య సంగీతాన్ని అందించే ఆలోచనలో ఉన్నారట. ఇందుకు మరికొంత సమయం పట్టనుండటంతో, రిలీజ్ తేదీని వాయిదా వేసుకున్నారని సమాచారం. వచ్చేనెల 16న గానీ .. 23న గాని ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే కచ్చితమైన రిలీజ్ డేట్ చెప్పనున్నారు.