మా ఇద్దరి ఆశయం ఒకటే!: కమల హాసన్
- నాది, రజనీది లక్ష్యం ఒకటే
- రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించేందుకు మాటలు సరిపోవు
- రజనీ చెప్పిన ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమవుతాయో లేదో కానీ అభివృద్ధి సాధ్యం
రజనీ చెప్పినట్లు రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజకీయాలు సాధ్యమవుతాయో లేదో కానీ, రాష్ట్రాభివృద్ధి మాత్రం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. త్వరలో నిర్వహించనున్న స్ధానిక ఎన్నికల్లో పోటీ చేయాలో వద్దో నిర్ణయించేందుకు కార్యకర్తలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 21న రామనాధపురంలో పార్టీ వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. విలువలేని ప్రాంతాల్లో తమిళ ప్రార్థన గీతాన్ని ఆలపించకూడదని ఆయన సూచించారు. లేని పక్షంలో కంచి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి వివాదం లాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.