మోదీపై విశ్వ హిందూ పరిషత్ నేత తొగాడియా సంచలన ఆరోపణలు
- నాకు వ్యతిరేకంగా మోదీ కుట్రలు చేస్తున్నారు
- మోదీకి, జేకే భట్ కు జరిగిన కాల్ రికార్డులు బయటపెట్టాలి
- అప్పుడు మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి
తొగాడియా వ్యవహారంలో వీహెచ్పీ నేతలు మూడు విధాలుగా ముందుకెళ్తున్నారు. కొందరు ఈ వివాదాన్ని ఇప్పటికే రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. మరికొందరు ఈ వ్యవహారంలో ఆరెస్సెస్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. మరికొందరు ఈ వ్యవహారానికి దూరంగా ఉంటున్నారు. ఈ నెల అలహాబాద్ లో మార్గదర్శక్ మండల్, సంత్ ల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో తొగాడియా విషయాన్ని ప్రస్తావించరాదని మరో వర్గం తీర్మానం చేసింది. మరోవైపు, తొగాడియా కూడా ఈ విషయంపై మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.