'ద తాష్కెంట్ ఫైల్స్' సినిమాలో శ్వేతాబసు ప్రసాద్!
- పాత్రికేయురాలి పాత్రలో కనిపించనున్న నటి
- లాల్ బహదూర్ శాస్త్రి మరణం కథాంశంగా తెరకెక్కనున్న చిత్రం
- దర్శకత్వం వహిస్తున్న వివేక్ అగ్నిహోత్రి
ఇటీవల ఆమె హిందీలో 'చంద్రనందిని' అనే సీరియల్‌లోను, 'బద్రీనాథ్ కీ దుల్హానియా' చిత్రంలోనూ కనిపించింది. ద తాష్కెంట్ ఫైల్స్ చిత్రంలో తాను నటించనున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా శ్వేతాబసు వెల్లడించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించనున్నారు.