తెలుగు భాష గొప్పతనం ఇప్పుడు తెలిసింది!: తమిళ నటుడు సూర్య!
- తెలుగు భాషను కొనియాడిన తమిళ నటుడు సూర్య
- పండుగకు విడుదల కానున్న ‘గ్యాంగ్’
- స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్న నటుడు
‘గ్యాంగ్’ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నానని, డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఎంతగానో ఆస్వాదించానని సూర్య వివరించాడు. తెలుగు భాషలోని గొప్పదనం తెలిసిందని, దానిని ‘సుందర తెలుగు’ అని ఎందుకంటారో ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నాడు. ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి తనకు 46 రోజులు పట్టిందన్నాడు. తెలుగును మున్ముందు మరింత బాగా నేర్చుకుంటానని సూర్య పేర్కొన్నాడు.