యాక్షన్ డ్రామా మూవీ దర్శకుడిగా ధనుష్ .. ఆగస్టులో సెట్స్ పైకి!
- హీరోగా .. నిర్మాతగా బిజీగా వున్న ధనుష్
- దర్శకుడిగా మరో సినిమా చేసేందుకు సిద్ధం
- భారీ తారాగణం .. భారీ బడ్జెట్
ఇది భారీ యాక్షన్ డ్రామా నేపథ్యంతో కూడిన చిత్రమనేది తాజా సమాచారం. భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ సినిమాకి ధనుష్ దర్శకుడిగా మాత్రమే వ్యవహరిస్తాడా? హీరోగా కూడా చేస్తాడా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. 2018 ఆగస్టులో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి, 2019 సమ్మర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.