'మెగా' హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తోన్న తేజు!
- తేజు హీరోగా వినాయక్ మూవీ
- 'కొండవీటి దొంగ' సాంగ్ పై దృష్టి
- ప్రత్యేక ఆకర్షణ కోసం ప్రయత్నం
'కొండవీటి దొంగ' సినిమాలోని 'ఛమకు ఛమకు ఛామ్' సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ పాటలో చిరూ వేసిన స్టెప్స్ కి అభిమానులు విజిల్స్ వర్షం కురిపించారు. ఇళయరాజా స్వరపరిచిన అప్పటి ఈ పాటను, వినాయక్ మూవీలో తేజు రీమిక్స్ చేసి సందడి చేయనున్నాడట. ఇదే నిజమైతే ఈ సాంగ్ రీమిక్స్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్పవచ్చు.