చిరంజీవిగారు చెప్పిన మాట ఎప్పటికీ మరచిపోను: అల్లు శిరీష్
- సెల్ఫీ అడిగారంటే అదృష్టమే అనుకోవాలి
- నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను
- చిరూ మాటలే మార్చేశాయి
అప్పుడాయన స్పందిస్తూ .. "ఒకసారి చిరంజీవి గారు నాకు ఒక మంచి మాట చెప్పారు. 'నువ్ హీరో అయ్యాక రోజూ చాలామంది కలుస్తుంటారు. ఆ తరువాత వాళ్లెవరూ నీకు గుర్తుండరు కూడా. కానీ అవతల వ్యక్తికి నిన్ను మళ్లీ కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అందువలన నువ్ వేరే మూడ్ లో ఉన్నప్పటికీ ఆ అభిమాని కోసం అవన్నీ కాసేపు పక్కన పెట్టేసేయ్. శిరీష్ నన్ను బాగా రిసీవ్ చేసుకున్నాడనేది తీపి జ్ఞాపకంగా ఆ అభిమానికి గుర్తుండిపోతుంది' అన్నారు. ఆయన మాటలు నన్ను ఆలోచింపజేశాయి .. మార్చేశాయి. ఎవరైనా సెల్ఫీ అడిగారంటే అదృష్టమేనని అనుకోవాలి .. అందుకే నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను' అంటూ చెప్పుకొచ్చాడు.