'ధర్మాభాయ్' గా సాయిధరమ్ తేజ్
- వినాయక్ తో తేజు మూవీ
- ముందుగా అనుకున్న టైటిల్ 'ఇంటెలిజెంట్'
- టైటిల్ మాస్ గా ఉండాలనేది వినాయక్ ఆలోచన
- 'ధర్మాభాయ్' ను ఖరారు చేసే ఛాన్స్
అయితే కింది తరగతి ప్రేక్షకులకు ఈ టైటిల్ ఎక్కదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేసినట్టుగా సమాచారం. దాంతో ఈ సినిమాకి 'ధర్మాభాయ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ఈ టైటిల్ అయితే మాస్ ఆడియన్స్ లోకి బాగా వెళుతుందనీ .. తేజుకి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కనుక, ఇదే టైటిల్ ను ఖరారు చేద్దామని అనుకుంటున్నారట. టైటిల్ విషయంలో నిర్ణయాన్ని తేజు .. వినాయక్ కే వదిలేశాడట. అందువలన దాదాపుగా ఇదే టైటిల్ ను ఖరారు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.