'సాహో'లో అరుణ్ విజయ్ విలన్ కాదట!
- షూటింగ్ దశలో అరుణ్ విజయ్
- రొటీన్ కి భిన్నమైన పాత్ర
- ఈ సినిమాపై ఆశలు
- తమిళ .. హిందీ భాషల్లోనూ విడుదల
అయితే ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించడట. తాను చేసేది మంచి పాత్రేనని ఆయనే స్వయంగా చెప్పాడు. తాను మంచి స్వభావం కలిగిన వాడిగానే కనిపిస్తాననీ, అయితే ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అన్నాడు. ఈ పాత్ర తనకి మరింత మంచి పేరు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.