మళ్లీ వినాయక్ తోనే బెల్లంకొండ శ్రీనివాస్
- సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ మూవీ
- ఆయన నెక్స్ట్ ప్రాజెక్టు హీరో బెల్లంకొండ శ్రీనివాస్
- గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అల్లుడు శీను'
- త్వరలో నే ఈ కాంబినేషన్ సెట్స్ పైకి
ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ .. శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది. మరో వైపున సాయిధరమ్ తేజ్ హీరోగా వినాయక్ ఒక సినిమా చేస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా సెట్స్ పై వుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ చేస్తోన్న ఇతర సినిమాలు పూర్తి కాగానే, వీళ్ల కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసుకునే పనిలో ఉందట. ఈ సారి కూడా ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి మరి.